భారత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1396 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్-19 సోకిన వారి సంఖ్య 27,892కు చేరింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 20,835 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఒక రోజు వ్యవధిలో 381 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 6184 మంది కరోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారు. భారత్‌లో కరోనా రికవరీ రేటు 22.17%గా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.
భారత్‌లో కొత్తగా 1396 కరోనా కేసులు