‘పల్లెప్రగతి’ స్ఫూర్తితో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘పట్టణప్రగతి’ కార్యక్రమం సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలిల్లో ్రప్రారంభమైంది. ఇటీవలే మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేసిన విధంగా ఎమ్మెల్యేలు, కలెక్టర్, మున్సిపల్ చైర్మన్లు, ఇతర అధికారులు సోమవారం ఆయా మున్సిపాలిటీలల్లో పర్యటించి సమస్యల గురించి ఆరా తీశారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు మెదక్‌లో ్రప్రారంభ సమావేశం నిర్వహించి పలు వార్డుల్లో తిరిగి సమస్యలు గుర్తించారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్‌తో కలిసి పట్ణణంలో పర్యటించారు. తూప్రాన్, రామాయంపేటలలో మున్సిపల్ చైర్మన్లు రాఘవేందర్ గౌడ్, జితేందర్‌గౌడ్ కౌన్సిలర్లు ఇతర అధికారులతో కలిసి ఆయా పట్టణాల్లో సమస్యలపై ఆరా తీశారు. అన్ని మున్సిపాలిటీలల్లోనూ ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ్రప్రారంభించారు. ఆయా మున్సిపాలిటీల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
'ప్రగతి' కి శ్రీకారం